20-03-2025 06:53:11 PM
జుక్కల్ ఎమ్మెల్యే..
జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలో పనిచేసే అన్ని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధికి సంబంధించి శంకుస్థాపనల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో ముందుకుసాగాలని అందుకు క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా తెలిపారు. ఈ విషయంలో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.