10-04-2025 01:21:03 AM
యాచారం ఏప్రిల్ 9 ఫార్మాసిటీకి సేకరించిన భూములకు కంచవేయుట నిలిపివేయాలి ఫార్మసిటిలో సేకరించిన భూముల రైతులకు కేటాయించిన ప్లాట్లు సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చి ప్లాట్లు చూపించకుండా అక్రమంగా కంచ వేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అలంపల్లి నరసింహ మాట్లాడుతూ.
గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లాట్ల స్థలాలు చూపించకుండా పట్టాలు ఇవ్వకుండా అక్రమంగా పోలీసులను ఉపయోగించి ఫార్మా భూములకు కంచ వేస్తున్నారు దీనిని వెంటనే నిలిపివేయాలని ప్లాట్లు కేటాయించే వరకు వ్యవసాయ భూముల్లోకి ఎమ్మార్వో రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు గాని వచ్చి కంచ వేయడాన్ని ఆపాలని అన్నారు. ఫార్మ సిటీలో అర్హులైన అసైన్మెంట్ దారులకు పరిహారం పూర్తిగా రాలేదు వారికి తగిన న్యాయం చేయాలి అలాగే ఫార్మాసిటీలో పిఓటి యాక్ట్ కింద పెండింగ్ లో పెట్టిన రైతుల కు నష్టపరిహారం రాలేదు .
అయినా భూములకు కంచ వేస్తున్నారు ఫార్మాసిటీకి భూములు ఇవ్వని రైతులకు హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ నిషేధిత జాబితాలో తొలగించకుండా కోర్టు ఆర్డర్ ను దిక్కరించి ఆ రైతులందరినీ ఇబ్బంది గురి చేస్తున్నారు పట్టా భూములు ఇవ్వని రైతుల అందరికీ న్యాయం చేయాలని ఫార్మాసిటీ గ్రామాలలో భూములు లేనటువంటి వ్యవసాయ కూలీలకు పునరావాసం చట్టం కింద వారికి పరిహారం చెల్లించాలి.
2013 చట్టం ప్రకారం అర్హులందరికీ న్యాయం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఎన్నికల మానిఫెస్టో ఫార్మసిటీ రద్దు చేసి రైతుల భూములు రైతులకి కేటాయిస్తామని చెప్పినటువంటి మాటను సీఎం నిలబెట్టుకోవాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ యాచారం మండల కమిటీ సభ్యులు నానక్ నగర్ మాజీ సర్పంచ్ దంతుక పెద్దయ్య ,
పార్టీ మండల కమిటీ సభ్యులు ముచ్చర్ల లాజర్ , ఆలంపల్లి జంగయ్య ,మేడిపల్లి గ్రామ శాఖ కార్యదర్శి గడ్డం కుమార్ ,వడ్డేవాని భూషణ్ ,అలంపల్లి పెంటయ్య, పార్టీ నాయకులు గడ్డం యాదగిరి ,గడ్డం రాములు, జకరత యాదయ్య, ఎండి గౌస్, కావలి నరసింహ, గజ్జ శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.