calender_icon.png 24 January, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల అపోహలను అధికారులు తొలగించాలి

23-01-2025 10:55:16 PM

ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలు పొందాలి

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు....

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రజల అపోహాలను అధికారులు తొలగించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు(MLA Thota Lakshmi Kantha Rao) అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని నిర్వహించిన గ్రామ సభలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలు "రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటికి అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంక్షేమ పథకాల అమలు లబ్ది దారుల ఎంపిక విధానం గురించి అధికారులు ప్రజలకు వివరించి వారి అపోహలు తొలగించాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వం భూమి లేని నిరుపేద రైతు కూలీలను గుర్తించి వారికి ఏడాదికి 12 వేల రూపాయలు "ఇందిరమ్మ ఆత్మీయ భరోసా" పేరుతో అందిస్తుందని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ప్రజలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు జారీ చేస్తుందని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం జుక్కల్ నియోజకవర్గంలో పేదలకు ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కానీ నేడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి వారి సొంత ఇంటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాలకు అభ్యున్నతికి పాటు పడుతుందని, పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్ ఏలేటి మల్లికార్జున్ రవీందర్ రెడ్డి, సాయి రెడ్డి, సాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.