జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్1 (విజయక్రాంతి): రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను పరిశీలించారు. అంతకుముందు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. హైదరాబాద్, రంగారెడ్డి, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. మెహదీపట్నంలోని ఎంఎన్‌డీసీ భవనం వద్ద సీవరేజీ పనులన పరిశీలించారు. మణికొండ సెక్రటేరియట్ కాలనీలో పర్యటిం చారు. తాగునీటి నాణ్యతను పరీక్షించారు. గండిపేట కాండూన్ అమర్చిన ప్రెషర్ ఫిల్టర్లను పరిశీలించారు.
కొత్త మ్యాన్‌హోళ్లు ఏర్పాటు చేయాలి..
భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ నగరంలోని బండ్లగూడ, హనుమాన్‌నగర్, గోడే కె ఖబర్ సెక్షన్‌లలోని పలు కాలనీల్లో పర్యటించారు. నీళ్లు నిలిచే ప్రాంతాలపై ఈఆర్టీ బృందాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, మ్యాన్‌హోళ్లు ధ్వంసమైన చోట కొత్త వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. మంచినీరు, మురుగునీటి సమస్యలుంటే జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి సంప్రదించాలని ఆయన సూచించారు.