calender_icon.png 28 October, 2024 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

03-09-2024 12:31:43 AM

రాష్ట్రవైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం ఆయన సంగారెడ్డి మం డలం కల్పగూర్ శివారులోని మంజీరా బ్యారేజీని పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులను సమీక్షించారు. ప్రాజెక్టులు, చెరువులు రక్షణకు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరదల తో ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. అనంతరం కల్పగూర్‌లో ముంపు బాధితుల సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు. మంజీరా బ్యారేజీలోకి వరదనీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు గ్రామాల ప్రజలకు సూచించారు. బ్యారేజీని ప్రభుత్వం టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తుందన్నారు. పర్యటనలో కలెక్టర్ క్రాంతి వల్లూర్, ఎస్పీ చెన్నూర్ రూపేశ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  ఉన్నారు.