calender_icon.png 20 November, 2024 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

21-07-2024 01:37:48 AM

  • భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలి
  • నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, జూలై 20(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు కృష్ణా, గోదావరి నదులకు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పెద్ద  వాగు ప్రమాదం నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ర్టవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోని నీటిపారుదల శాఖ అధికారులంతా విధుల్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని, వరద ఉధృతిపై ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.

అనుమతి లేకుండా ఎవరూ హెడ్ క్వార్టర్ వదలి వెళ్లొద్దని.. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, ప్రధాన, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులలోకి గంట గంటకు వచ్చే ప్రవాహాలను పర్యవేక్షించాలని, మార్గదర్శకాల ప్రకారం గేట్ల నిర్వ హణ చేపట్టాలన్నారు. ప్రాజెక్టులకు భారీగా వస్తోన్న ఇన్‌ఫ్లో, దిగువనకు వదులుతున్న అవుట్ ఫ్లోపై ప్రజలకు ఎప్పటికప్పు డు సమాచారం అందిస్తూ అప్రమత్తం చేయాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని.. ఎక్కడైనా అవసరమైన తాత్కాలిక పునరుద్ధరణ పనులుంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.