- ఆర్థిక శాఖ ఆఫీసర్లకు ఆదేశాలు
- ఎమ్మెల్యేలు లేవనెత్తే ప్రశ్నలకు పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలన్న సీఎస్
హైదరాబాద్ జూలై 20 (విజయక్రాంతి): ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు తప్పకుండా హాజరుకావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ.. శాసనసభ్యు లు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచారంతో సమా ధానాలు పంపేందుకు అధికారులు అందుబాటులో ఉండాల న్నారు. రాష్ర్ట వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 25న ప్రవేశపెట్టనున్నట్లు సీఎస్‌కు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన తదుపరి రోజుల్లో వివి ధ శాఖల డిమాండ్లపై చర్చ జరుగుతుందన్నారు. నోట్ ఆన్ డిమాండ్ రూపొందించడం వల్ల ఎమ్మెల్యేలు దానిని పరిశీలించడానికి, చర్చకు సంబంధించిన విషయాలను లేవనెత్తడానికి తగిన సమ యం ఉంటుందని ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు సందీప్‌కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్, శైలజా రామయ్యర్, కార్యదర్శులు రఘునందన్‌రావు, బుద్ధ ప్రకాష్ జ్యోతి, కరుణ, లోకేష్ కుమార్, సీఐపీఆర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.