నాసిరకం చేపపిల్లల పంపిణీపై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆగ్రహం
నల్లగొండ, నవంబర్ 14 (విజయక్రాంతి): చేపపిల్లల నాణ్యతపై మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని టెయిల్ పాండ్‌లో చేపపిల్లలను వదిలేందుకు ఎమ్మెల్యే గురువారం వచ్చా రు. ప్రభుత్వం నిర్దేశించిన సైజులో కాకుండా చిన్న సైజు చేపపిల్లలను తీసుకురావడంతో మత్స్యశాఖ అధికారు లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మత్స్యకారులకు ఉపాధినిచ్చేందుకు ప్రభుత్వం చేపపిల్లలను అందిస్తుంటే.. నాణ్యత లేని వాటిని అందించడం వల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. అధికారులు బాధ్యతగా మసలుకోవాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని సూచించారు. తక్షణమే చేపపిల్లలను వెనక్కు పంపాలని ఆదేశించారు. ఎమ్మె ల్యే వెంట డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.