calender_icon.png 20 November, 2024 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జునసాగర్ 14 గేట్లు ఎత్తిన అధికారులు

05-08-2024 05:45:09 PM

హైదరాబాద్: నాగార్జునసాగర్ జాలాశాయనికి వరద ప్రవాహం కొనసాగతుంది. అధికారులు సోమవారం ఉదయం 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కృష్ణమ్మకు పూజ చేసి గేట్లు పైకెత్తారు.  ప్రస్తుతం మరో నాలుగు గేట్లు కూడా ఎత్తి నీటిని విడుదల చేశారు. మొత్తం 14 గేట్లు ఎత్తడంతో సాగర్ జాలాలు పాల నురగలా దూకుతున్నాయి. దిగువకు 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ ఇన్ ఫ్లో 2,74,000 క్యూసెక్యులు, ఔట్ ఫ్లో 1,13,889 క్యూసెక్యులుగా ఉంది.590 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్న ఈ జాలాశయం ప్రస్తుత నీటిమట్టం 583.60 అడుగులకు చేరుకోగా, మొత్తం నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు, ప్రస్తుతం 293.39 టీఎంసీలు నీటినిల్వ ఉంది.