హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం ముమ్మరంగా దాడులు చేశారు. ఒకేరోజు 110 ప్రాంతాల్లో మోమోస్ తయారీ కేంద్రా ల్లో ఆకస్మిక తనిఖీలు జరిపిన అధికారులు 69 శాంపిల్స్‌ను సేకరించి.. టెస్టులకు పం పారు.
బంజారాహిల్స్ నందినగర్‌లో సోమవారం మోమోస్‌ను తిని ఒక మహిళ మర ణించగా.. 60 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయాన్ని సీరి యస్‌గా తీసుకున్న జీహెచ్‌ఎంసీ హెల్త్ విభాగం నందినగర్ మోమోస్ సెంటర్‌కు ఖైరతాబాద్ చింతల్ బస్తీ తయారీ కేంద్రం నుంచి సరఫరా అవుతున్నట్టుగా గుర్తించి.. ఆ తయారీ కేంద్రంలో తనిఖీలు చేశారు.
అలాగే అల్వాల్, లోతుకుంట, గోషామహల్, లంగర్‌హౌజ్, మెహిదీపట్నం, సంతోష్ నగర్, చార్మినార్, ఎల్‌బీ నగర్, హయత్ నగర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ (హెల్త్) పంకజ తెలిపారు. ఈ క్రమంలో మోమోస్ సెంటర్లలో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో పాటు నాణ్యత లేని ఆహారపదార్థాలు వినియోగిస్తున్నట్లు వారు అధికారులు గుర్తించి ఆయా షాపులకు నోటీసులు అందజేశారు. సేకరించిన శాంపిల్స్ ఫలితాలు వచ్చాకా దుకాణాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.