calender_icon.png 15 November, 2024 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ షాపుల్లో అధికారుల దాడులు

10-11-2024 01:15:48 AM

అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ చేసిన మందులు సీజ్

సంగారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని పలు మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. పటాన్‌చెరులోని జేపీ కాలనీలో అనుమతులు లేకుండా మందులు అమ్ముతున్నారనే సమాచారంతో బచ్చు సాయిచరణ్ అనే వ్యక్తి నివాసంలో దాడులు చేసి అక్రమంగా నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. రూ.1.51 లక్షల విలువైన 54 రకాల మందులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దాడుల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఎం చంద్రశేఖర్, జీ శ్రీకాంత్, టీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.