calender_icon.png 29 January, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భువనగిరిలో హోటళ్లపై అధికారుల దాడులు

03-11-2024 04:38:04 AM

యాదాద్రి భువనగిరి, నవంబర్ 2 (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారులు డాక్టర్ సుమన్ కల్యాణ, స్వాతి నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. వంటగదులు, స్టోర్ రూమ్స్, భోజనశాలలు తనిఖీ చేసి అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నట్లు గుర్తించారు. నాసిరకం పదార్థాలతో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించి.. పలు హోటళ్లకు రూ.30 వేల జరిమానా, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.