06-03-2025 02:44:22 PM
చిట్యాల, (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం(Chityala mandal)లోని లక్ష్మీపూర్ తండా గ్రామంలో జరుగుతున్న బాల్య వివాహాన్ని గురువారం మండల అధికారులు అడ్డుకున్నారు. చిట్యాల సిఐ దగ్గు మల్లేష్ యాదవ్ కు బాల్య వివాహంపై ఫిర్యాదు అందినట్లు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు మండలాధికారులు గ్రామానికి చేరుకుని బాల్య వివాహంపై ఆరా తీశారు. మైనర్ కావడంతో వివాహాన్ని అడ్డుకున్నారు.ఈ మేరకు వారికి కౌన్సిలింగ్ నిర్వహించడానికి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు జిల్లాకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం చట్టరీత్య నేరమని తెలిపారు. మైనర్ వివాహాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చిట్యాల రెండవ ఎస్సై ఈశ్వరయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, పోలీస్ అధికారులు లింగన్న, రమేష్, నాగరాజు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.