30-03-2025 12:59:04 AM
మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండేలా స్థలాల ఎంపిక
నేటి నుంచి పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ
పెద్దపల్లి జిల్లాలోని పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి శ్రీధర్‌బాబు
కమార్‌పూర్/ రామగిరి/ మంథని, మార్చి- 29 (విజయక్రాంతి): అధికారులంతా చట్టానికి లోబడి, జవాబుదారీతనంతో పని చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూ చించారు. శనివారం మంత్రి శ్రీధర్‌బాబు పెద్దపల్లి జిల్లా కమాన్‌పూ ర్ మండలంలో రూ.50 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టిన తహసీల్దార్ భవన నిర్మాణ పనులకు కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే కార్యాలయాల నిర్మాణ పనులను ప్రజా ప్రభు త్వం చేపడుతుందని చెప్పారు. కమాన్ పూర్, రామగిరి మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయ భవనాలు, మంథని డివిజన్ కేం ద్రంలో సమీకృత అధికారుల సముదాయం, నూతన ఆర్డీవో కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. ప్రజలకు ఉన్న సమ స్యలను చట్ట ప్రకారం పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను సూచించారు.
మండల కేంద్రాల్లోనూ కార్యాలయాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండేలా అనువైన స్థలాలను ఎంపిక చేయాలని మంత్రి కలెక్టర్‌కు సూచించారు. కమార్‌పూర్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేపడతామని.. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలిస్తామని, ఆధునిక సౌకర్యాలతో గ్రంథాలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు. ఉద్యమ సమయంలో కమాన్‌పూ ర్ మండలానికి జూనియర్ కళాశాల, జేఎన్‌టీయూ ఇంజిరింగ్ కళాశాల, హార్టికల్చర్ యూనివర్సిటీ, 130/32 సబ్‌స్టేషన్ వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు.
రామగిరి మండలంలో..
రామగిరి మండలంలో రూ.65 లక్షలతో చేపట్టిన తహసీల్దార్ భవన నిర్మాణానికి, రూ.67 లక్షలతో చేపట్టిన కస్తూర్బా గాంధీ విద్యాలయ అప్రోచ్ రోడ్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు, మంథని ఆర్డీవో వద్ద రూ.4.5 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టిన సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయ నిర్మాణ పనులకు, రూ.30 లక్షలతో చేపట్టిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రిన్నోవేషన్ పనులకు, రూ.35 లక్షలతో చేపట్టిన ముత్తారం కస్తూర్బా గాంధీ విద్యాలయ అభివృద్ధి పనులకు, రూ.80 లక్షలతో చేపట్టిన ముత్తారం మోడల్ స్కూల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో ఆర్డీవో సురేశ్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ చక్రవర్తి, ఈఈ పీఆర్ గిరీశ్‌బాబు, డీఈ నవీన్‌కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతియాదవ్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రమాదేవి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు ప్రసాద్, శశిభూషణ్ కాచే, కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం, ముత్తారం మండలాధ్యక్షుడు దొడ్డ బాలాజీ పాల్గొన్నారు.
రేషన్‌కార్డులపై ఉచిత సన్నబియ్యం పంపిణీ
ఉగాది నుంచి రేషన్‌కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పం పిణీ చేస్తున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రైతులకు ఒక గింజ కూడా తాళ్లు కట్ చేయకుండా మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేశామన్నారు.