calender_icon.png 6 March, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగుకు పనికిరాని భూములను పరిశీలించిన అధికారులు

05-03-2025 09:06:43 PM

మొగుడంపల్లి/సంగారెడ్డి (విజయక్రాంతి): జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మొగుడంపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో సాగుకు పనికిరాని భూములను అధికారులు బుధవారం పరిశీలించారు. భూముల భూ పరిష్కారాలకు మార్గాలు చూపెట్టాలని అధికారుల సూచించారు. ఈ సందర్బంగా ఆర్డీవో రామిరెడ్డి, తహశీల్దార్ హసీనా బేగం భూముల సాగు అవకాశాల పెంపుపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూసమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సాయికిరణ్, అగ్రికల్చర్ అధికారి సరస్వతి, రెవిన్యూ సిబ్బంది ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.