25-03-2025 08:26:03 PM
పెద్ద కొడఫ్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని చిన్న తక్కడపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళను, క్లీనింగ్ పనులను, సీసీ రోడ్డు నిర్మాణ పనులను మండల ప్రత్యేక అధికారి కిషన్ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ... ఇళ్ల నిర్మాణాల పనులు వేగవంతంగా చేయాలని చేయని యెడల ఉత్తర్వులు రద్దు చేయబడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దశరథ్, ఎంపీడీవో లక్ష్మీకాంత్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.