calender_icon.png 9 May, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన అధికారులు

22-04-2025 01:50:16 AM

కామారెడ్డి, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని 50 పడకలుగా మార్చడం కొరకు హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని సోమవారం  హైదరాబాద్ కు చెందిన ఎంఐ డిపి అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి హాస్పిటల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. దోమకొండ మండల కేంద్రంలోని శివరామందిరం ఆలయం కి సంబంధించిన దేవుని కుంట స్థలాన్ని , గుండ్ల చెరువు ప్రాంతంలో స్థలాన్ని, ముత్యంపేట రోడ్డు ప్రాంతంలో స్థలాలను పరిశీలించారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సూచన మేరకు అధికారులు హాస్పిటల్ స్థల పరిశీలనకు విచ్చేసినట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. స్థల పరిశీలనలో అధికారులు కుమార్ నరసింహ అశోక్, డిసిహెచ్‌ఎస్ విజయలక్ష్మి, మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, తహసిల్దార్ సంజయ్ రావు, మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి స్వామి, గ్రామ అధ్యక్షుడు మధు,కాంగ్రెస్ నాయకుడు రామస్వామి  ఉన్నారు.