calender_icon.png 23 November, 2024 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయవ్వకు అధికారుల సాయం

23-11-2024 12:00:00 AM

  1. న్యాయసేవా సంస్థ ప్రతినిధుల కౌన్సిలింగ్ 
  2. సేవలందిస్తున్న కొడుకు.. పరారీలో కూతురు 

కామారెడ్డి, నవంబర్ 22 (విజయక్రాంతి): విజయక్రాంతి పత్రికలో శుక్రవారం ‘అనాథగా అమ్మ’ శీర్షికతో వచ్చిన కథనానికి మేడ్చల్ జిల్లా జడ్జి కిరణ్‌కుమార్ స్పందించారు. కథనాన్ని చదివి కామారెడ్డి జిల్లా జడ్జి వరప్రసాద్‌తో మా ట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దీంతో కామారెడ్డి న్యాయసేవా సంస్థ ప్రతినిధులు శుక్రవారం కామారెడ్డి ప్రభుత్వాసు పత్రికి వెళ్లి చిక్సిత పొందుతున్న వృద్ధురాలు సాయవ్వను పరామర్శించారు. కొడు కు వెంకటేశ్‌ను ఆసుపత్రికి రప్పించారు. కూతు రు ఇంటికి వెళ్లి పరిశీలించగా ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయింది. సాయవ్వ కుమారుడు వెంకటేశ్ కు కౌన్సిలింగ్ నిర్వహించారు.

అమ్మ అమ్మిన ఆస్తుల డబ్బు తన సోదరికి ఇచ్చిందని తనకు ఇవ్వలేదని వెంకటేశ్ న్యాయసే వా సంస్థ ప్రతినిధులకు తెలిపాడు. కూతురు వద్ద ఉన్న డబ్బుల్లో సగం ఇప్పిస్తామని న్యాయసేవా సంస్థ ప్రతినిధులు నచ్చచెప్పడంతో వెంకటేశ్ తల్లికి సేవలు అందిస్తున్నారు. వెంకటేశ్‌ను ఆసుపత్రి సిబ్బంది అభినందించారు. బంధువు లు కూడా సాయవ్వను పరామర్శించారు.