11-03-2025 10:57:26 PM
పెద్దకొడఫ్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను మంగళవారం మండల ప్రత్యేక అధికారి కిషన్, తహశీల్దార్ దశరథ్, ఎంపీడీవో లక్ష్మీకాంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ లో భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతిరోజు శానిటేషన్ చేయాలని, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని పిల్లలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులతో, వంట సిబ్బందితో చర్చించడం జరిగింది. అలాగే విద్యార్థుల నైపుణ్యాలను విద్యార్థులకు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల ప్రధానోపాధ్యాయులు సునీత, ఉపాధ్యాయ బృందం పాల్గొంది.