01-03-2025 04:54:48 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్ ఎం.సదానందంను గ్రేడ్ 3 కార్యదర్శి నరేష్ కుమార్ వేధింపులు తాళలేక ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగిందని సెక్యూరిటీ గార్డు అండగా మార్కెట్ సెక్యూరిటి గార్డ్స్ యూనియన్ (సీఐటీయూ) ఉంటుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ స్పందిస్తూ రాష్ట్ర నాయకత్వం సంప్రదించి ఇల్లందు మార్కెట్ కమిటీకి వెళ్లి సదానందంని పరామర్శించి, వారి ఆరోగ్యం పట్ల డాక్టర్ తో సంప్రదించారు. ఆయనకు రాష్ట్రంలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం అండగా ఉంటామని సీఐటీయూ నాయకత్వం ధైర్యంగా ఉండాలని కోరారు.
నరేష్ కుమార్ గ్రేట్ 3 సెక్రటరీ ప్రవర్తనపై విచారణ చేపట్టి సదానందంకి తగు న్యాయం జరిగేలా చూడాలని, వేధింపులు గురి చేసిన అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీఎంఓకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ సారిక రాము, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబిలు మాట్లాడుతూ... మార్కెట్ యార్డు సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ పోరాడుతున్నారని, ఇల్లందు గార్డు సదానందంకు అండగా సంఘం ఉన్నదని, ఆయనకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తాళ్లూరి కృష్ణ, ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ మహమూద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సీహెచ్.లక్ష్మయ్య , రాష్ట్ర నాయకులు మునీర్, ఎస్ రమేష్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జి. వెంకటనారాయణ. జనార్ధన్, రాములు గారు. ఇల్లందు మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్ ఎస్. మోహన్ రావు పి.హరికృష్ణ, ఏ .కార్తీక్ బి. రమేష్, సిహెచ్. విజయ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.