ముత్తారం (విజయక్రాంతి): చంద్రాపూర్ టు విజయవాడ వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి (NH) పనులకు శుక్రవారం ముత్తారం మండలంలోని మైదాంబండ, పోతారం గ్రామాలలో తాహసిల్దార్ సుమన్ ఆధ్వర్యంలో ఎస్ఐ నరేష్ తో పాటు రైతుల సమక్షంలో ట్రెంచ్ కొట్టారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ.. జాతీయ రహదారికి రైతులు ప్రజలు సహకరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూములు కోల్పోతున్న రైతులకు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు నష్టపరిహారం చెల్లించామని, కొంతమంది ఈ పనులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, భూములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని తాహసిల్దార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ భవానీ ప్రసాద్, ఆర్ఐ రాజబాబు, శ్రీధర్, మాజీ సర్పంచ్ నెత్తెట్ల మహేందర్, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.