కామారెడ్డి,(విజయక్రాంతి): సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇంటికి వెళ్లి సర్వేను నిర్వహించినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వెంకట రమణారెడ్డి కుటుంబ వివరాలను సేకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్, ఎన్యుమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.