calender_icon.png 11 March, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిలా పాపం తల పిడికెడు..

02-02-2025 06:19:59 PM

గత ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లపై విచారణ ప్రారంభించిన అధికారులు.. 

వేల ఎకరాల అసైన్డ్ భూములు పట్టాలుగా మారినట్టు గుర్తించిన అధికారులు.. 

ఈ వ్యవహారంలో కోర్టుకు పడగలెత్తిన అధికారులు రాజకీయ నాయకులు..

నిజామాబాద్ (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ అయిన భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. జిల్లాలో భారీగా భూముల కనుగొల్లు జరిగి పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయని ఈ విషయమై జిల్లా యంత్రాంగం గోప్యంగా విచారణ మొదలుపెట్టింది. గతంలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన సిరిసిల్ల నియోజకవర్గంలో వేల ఎకరాల కొద్ది ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై ప్రవేట్ వారి సొత్తుగా మారిన నేపథ్యంలో జిల్లాలో కూడా చేతులు మారి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు మొదలైంది.  గత ప్రభుత్వ ఆయాంలో జరిగిన అసైన్డ్ భూములు భూ రిజిస్ట్రేషన్లు కొనుగోలు చేసిన దస్త్రాలపై విచారణ మొదలైంది గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బడా నేతలు మొదలుకొని చోటామోటా నాయకులు బినామీలుగా ఉన్న వారి బంధువుల వివరాలను సేకరిస్తూ వారి పేర ఏ ప్రాంతంలో భూమి రిజిస్ట్రేషన్ అయింది ఏ మేరకు రిజిస్ట్రేషన్ అయింది చెల్లింపులు ఎలా జరిగాయి. ఈ భూ రిజిస్ట్రేషన్ ల విషయమై ప్రధాన పాత్ర ఎవరు పోషించారు సంబంధిత భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు ఎవరెవరు భూములు కొనుగోలు చేశారు కొనుగోలు అయిన భూములలో ఎన్ని ఉన్నాయి నిజామాబాద్ నగరం చుట్టూ భూముల వ్యవహారంతో పాటు జిల్లాలోని ఆర్మూర్ బోధన్ డివిజన్లో మున్సిపాలిటీ పరిధిలో గల రిజిస్ట్రేషన్ల వివరాలను సేకరిస్తున్నారు. 

అత్యంత పకడ్బందీగా అధికారులు వివరాలను సేకరణ ఈ విచారణలో ప్రాథమికంగా అసైన్ భూములు అన్నిక్రాంతమైనట్టుగా గుర్తించినట్టు విశ్వాసనీయ సమాచారం పట్టా భూములు ఎకరం ఉంటే అందులో అదనంగా భూములు ఐదు ఎకరాలు కలిపి రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనలు జి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత ప్రభుత్వ కాల పరిమితి ముగుస్తున్న సమయంలో భూములు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయి వీటిలో పట్టా భూములతో పాటు అసైన్ భూములు కూడా కొనుగోలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ధరణి తర్వాత ధరణికి ముందు జరిగిన భూముల లావాదేవీలు, భూమార్పిడిలు మిగులు భూములు తదుపరి అయిన రిజిస్ట్రేషన్ల విషయమై జిల్లా యంత్రాంగం వడపోత ప్రారంభించింది. అసైన్ భూములు కొన్న వాళ్లలో వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు మధ్యతరగతి ప్రజలతో పాటు  ఉద్యోగులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున భూములు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు బినామీల పేర్ల రిజిస్ట్రేషన్ అయినట్టు అధికారులు గుర్తించారు. ఒక ప్రజాప్రతినిధి తన కుమారులకై 60 ఎకరాల చొప్పున భూముల లో ఫామ్ హౌస్ లు నిర్మించినట్టు అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తెలుస్తోంది. నివాసయోగ్యమయ్యే ప్లాట్లకంటే వ్యవసాయ భూములపైనే పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేయడంతో భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. 

అధికారుల చేతివాటం ప్రతి పనిలో పర్సంటేజీలు భాగస్వామ్యంతో కూడిన ఒప్పందంతో వెలిసిన వెంచర్లలో అసైన్డ్ భూములు కూడా పట్టాలుగా మార్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చెరువులు కుంటలు సైతం కబ్జా చేసి ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్ల మేర మొరంతో నింపి లెవెల్ చేసి ప్లాట్లు వేసి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో వేల ఎకరాలు అసైన్ భూములు పట్టాలుగా మారి లేఔట్లు చేసి కోట్ల కొద్ది డబ్బును దండుకున్నట్లు తెలుస్తోంది ఈ అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్లాట్ల అమ్మకాలలో అధికారులకు కూడా వాటాతో పాటు భారీగానే ముడుపులు ముట్టినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.  ఇది ఇలా ఉండగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే స్థితిలో అధికారులు నియమ నిబంధనలను ఉల్లంఘించి అక్రమార్కులకు సహకరించి అందిన కాడికి దండుకొని కోట్లకు పడగలెత్తారు. అసైన్ ల్యాండ్ ప్రైవేట్ పట్టా కావడం వెంటనే లేఅవుట్ కావడం లేఔట్ లో ప్లాట్ లకి నెంబర్లు కేటాయించడం మౌలిక వసతులు నీటి సరఫరా ఏర్పడడం రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు వెనువెంటనే మున్సిపల్ లో ముంతకిల్లు కావడం అంతా సింగిల్ విండో పద్దతిలోనే చక చక జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు పట్టా పాసు బుక్కు వచ్చిన రోజే భూమి అమ్మకం జరిగినట్టు కూడా అధికారులు గుర్తించారు. 

తాము చెప్పిందే శిలాశాసనంగా వ్యవహరించిన రాజకీయ నాయకులు తమ కుటుంబ సభ్యులు  సహకరించిన అధికారులు నాయకులు వారి బినామీల పేరిట పువ్వులు రిజిస్ట్రేషన్ చేసి వ్యాపారాలలో వాళ్లను భాగస్వామ్యం చేసి నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల  ఉన్న అసేంట్ భూములు మండలాలలోని వేల ఎకరాల భూములు  సొమ్ము చేసుకోవడానికి లేఅవుట్లుగా మారగా బడా నాయకుల చేతికి చిక్కిన ఎకరాల అసైన్డ్ భూములు పామోసులుగా ఏర్పాటు చేసుకుని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సెండ్ భూములు చేతులు మారడంపై ఎంక్వయిరీ మొదలుపెట్టిన ప్రభుత్వ అధికారులు గత ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ నగరంలో అమ్మకాలు కొనసాగిన భూముల వివరాలను పరిశీలించడంతోపాటు పూర్తి పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో జిల్లా అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు నిజామాబాద్ నగరంలోని చుట్టుపక్కల భూములతో పాటు ఇతర మండలాల భూములు వివరాలను పరిశీలించగా వైద్యులు రాజకీయ నాయకులు వ్యాపారులు ఉద్యోగులు జిల్లాలో భూములను భారీగా కొనుగోలు చేసినట్టు బయటపడింది. 

పది ఎకరాలు మొదలుకొని 89 ఎకరాల వరకు భూముల క్రయవిక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది. ధరణికి ముందు తక్కువగా ఉన్న పట్టా భూములు ప్రస్తుతం 60 70 80 ఎకరాల్లో పట్టాగా ఎలా పుట్టుకొచ్చాయని అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఇది అంతా ఎవరి వ్యాయాంలో జరిగింది కారకులు ఎవరు అనే కోణంలో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారిని నియమించి విచారణ జరపనున్నట్టు విశ్వాసనీయ సమాచారం ధరణి పి ఏర్పడిన తదుపరి అసైన్డ్ భూములు ఎక్కువగా చేతులు మారి పక్కాగా పట్టాలు రూపొందించినట్టు తెలుస్తోంది పి సి ఎల్ ఏ జిల్లా అధికారులకు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. పట్టా భూములతో పాటు అదనంగా లేదా నేరుగా అసేన్ భూముల రిజిస్ట్రేషన్ కు పాల్పడిన అధికారులపై విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకొని అసేన్ భూముల పట్టాలను రద్దు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు విశ్వాసనీయ సమాచారం.