13-03-2025 01:01:36 AM
అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. తొలుత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా అని అంతా భావించగా.. ఆ సినిమా ఎందుకో చాలా ఆలస్యమవుతుండటంతో అట్లీతో సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూ స్తున్నారు.
దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 8న అధికారిక ప్రకటన చేస్తారని టాక్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ స్పెషల్ ట్రైనింగ్‌కి వెళ్లాడని తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటి వరకూ అంతా ఈ సినిమాను జూన్‌లో ప్రారంభిస్తారని అనుకుంటున్నారు.