calender_icon.png 29 December, 2024 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి 10లోపు ఆఫీసులు తరలించాలి

29-12-2024 01:57:15 AM

కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి డిసెంబర్-28(విజయ క్రాంతి) ః జనవరి 10వ తేదీ లోపు పెద్దపల్లి ఎంపిడీఓ ప్రాంగణంలోని కార్యాలయాల తరలింపు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  అన్నారు. శనివారం  కలెక్టర్  సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బస్సు డిపో ఏర్పాటుకు భూమి అప్పగింతపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ పెద్దపల్లిలో బస్సు డిపో మంజూరైన నేపథ్యంలో స్థలం అప్పగించేందుకు వీలుగా పెద్దపల్లి ఎంపీడీవో ప్రాంగణంలో ఉన్న కార్యాలయాల తరలింపు వేగవంతం చేయాలన్నారు.

పెద్దపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం,  పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ కార్యాలయాలు, అబ్కారీ శాఖ కార్యాలయం తరలింపుకు ప్రభుత్వ భవనాలలో అనువైన చోటున ఎంపిక చేసుకోవాలని, అవసరమైతే ప్రైవేటు భవనాలను సైతం  ఎంచుకోవాలని, జనవరి 10 లోపు కార్యాలయాల తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఈ. గిరీష్ బాబు, డిఇఓ మాధవి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.