calender_icon.png 21 September, 2024 | 11:02 AM

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

07-09-2024 12:48:07 AM

  1. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
  2. అసాంఘిక శక్తులకు మంత్రి సీతక్క వార్నింగ్

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయ క్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు సమన్వయంతో, అప్రమత్తంగా వ్యవ హరించి శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు నిర్వ హించాలని మంత్రి సీతక్క సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు, డీపీవో లు, మున్సిపల్ క మిషనర్లతో శుక్రవారం సచివా లయం నుంచి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో వినాయక చవితి ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. గణేశ్ ఉత్సవ కమిటీలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘా తం కలిగించే చర్యలను తమ ప్రభుత్వం సహించబోదని, ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తామని, అంద రి హక్కులను ప్రభుత్వం కాపాడుతుందని తెలిపారు.

ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లకు వంద శాతం జీతాలను తమ ప్రభుత్వం పెంచినట్టు మంత్రి గుర్తు చేశారు. ఇంకా జిల్లా అభివృద్ధి కోసం మరెన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. వినాయక చవితి నేపథ్యంలో జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు పలు కీలక సూచనలు చేశారు.

డయల్ 100కి వచ్చే కాల్స్‌పై తక్షణం స్పందించాలని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు ప్రచారం చేసే సోషల్ మీడియా మీద నిఘా పెంచాలని చెప్పారు. ఈ సందర్భంగా తమ పరిధిలో చేపట్టిన ఏర్పాట్లను,  శాంతి భద్రతల పరిస్థితులను ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మంత్రికి వివరించారు.