calender_icon.png 13 March, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్‌స్టేషన్ మెట్లెక్కిన అధికారులు

13-03-2025 01:56:04 AM

ఉపాధి హామీ పనులను అడ్డుకున్న  ఫారెస్ట్ అధికారులు

దురుసుగా ప్రవర్తించి బూతులు తిట్టాడని ఆరోపించిన ఉపాధి కూలీలు

ఎంపీడీవో, ఫారెస్ట్ అధికారుల వాగ్వాదం.. 

పరస్పర ఫిర్యాదులు.. కేసులు నమోదు..

కాగజ్‌నగర్, మార్చి 12 : కాగజ్ నగర్ మండలం దరిగాం సమీపంలో ఉపాధి హా మీ కూలీలు పనులు  చేస్తుండగా అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఇక్కడ ఎవరి అనుమతితో పనిచేస్తున్నారని దబాయిస్తు కూలీలు వచ్చిన వాహనం తాళాలు తీసుకు ని వెళ్ళిపోయారు. విషయం  ఎంపిడిఓ రమే శ్‌కు తెలుపగా ఘటనాస్థలికి చేరుకుని బీట్ అధికారి రవిని ఫోన్‌లో సంప్రధించగా ఇద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ విష యం చిలికిచిలికి గాలివానగా  మారి  పోలీ స్‌స్టేషన్ మెట్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. పరస్పరం పిర్యాధులు చేసుకునే దాకా వెళ్లింది. కూలీల వచ్చిన వాహనాన్ని సీజ్ చేసి ఎంపిడిఓ రమేశ్ తో పాటు మరో ఇద్దరిపై ఫారెస్ట్ అధికారులు కేసు నమోధు చేయగా, విధి నిర్వహణలో అడ్డుకుని వ్యక్తిగతంగా దూషించారని ఎంపిడిఓతోపాటు పలువురు ఉపాధి కూలీలు ఫారెస్ట్ అధికారులపై పిర్యాధు చేశారు.

ఈ విషయమై అధికారులను సంప్రదించగా అటవీప్రాంతంలో ఉపాధి హామీ పనులు చేయడానికి సంబంధిత అధికారుల వద్ద తాము గతంలోనే అనుమతులు తీసుకున్నామని ఎంపిడిఓ రమేశ్ తెలుపగా,  ఉపాధి హామీ పనుల కోసం అనుమతి తీసుకున్న ప్రదేశంలో కాకుండా మరో ప్రదేశంలో పనులు చేస్తుండటంతోనే తమ సిబ్బంది అడ్డుకున్నారని ఎఫ్‌ఆర్‌ఓ అనిల్ కుమార్ తెలిపారు.