calender_icon.png 23 February, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన అధికారులు

21-02-2025 12:54:48 AM

హైదరాబాద్ సిటీబ్యూరో/భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 20(విజయక్రాం తి): లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల వ్య వసాయ అధికారి సాయి శాంతన్ కు మార్ గురువారం ఏసీబీకి చిక్కాడు. అశ్వాపురంలో ఓ రైతు తాను పండించిన పంట విక్రయించేందుకు వ్యవసా  అధికారి నుంచి కూపన్ జారీ చే  ఉంది.

అందుకు వ్యవసాయ అధికారి సాయి శాంతన్‌కుమార్ రూ.30 వేలు డిమాండ్ చేశాడు. రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. గురుంవారం రూ.30 వేలు లంచం ఇస్తుండ గా ఏసీబీ అధికారులు అధికారిని పట్టుకున్నారు.

హైదరాబాద్‌లోని టీఎస్‌సీసీ డీసీలో ఈడీ, ఎఫ్‌ఏసీ జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న బొప్పూరి ఆనంద్‌కు మార్ ఏసీబీకి చిక్కాడు. ఓ కాంట్రాక్టర్‌కు రావాల్సిన రూ.33.32 లక్షల బిల్లు ను మంజూరు చేసేందుకు రూ.1.33 లక్షలను డిమాండ్ చేశాడు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.