* లంచం తీసుకుంటూ పట్టుబడిన శ్యామ్‌పూర్ పశువైద్యాధికారి, లింగంపేట ఎస్సై
ఆదిలాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యామ్‌పూర్ అసిస్టెంట్ పశువైద్యాధికారిగా రాథోడ్ రమేశ్ పనిచేస్తున్నాడు. అదే మండలంలోని ఉదయనాయక్ తండాలో పశుసంవర్ధక శాఖలో పని చేస్తున్న ఉద్యోగి జుగ్నక్ మాధవ్ ఇటీవల బదిలీ అయ్యారు.
సదరు ఉద్యోగి రెండు నెలల డ్యూటీ సర్టిఫికెట్ కోసం రాథోడ్ రమేశ్‌ను సంప్రదించగా.. రూ.15 వేలు లంచం డిమాండ్ చేశౠడు. దీంతో జుగ్నక్ మాధవ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం మాధవ్ నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటుండుగా ఏసీబీ అధికారులు రాథోడ్ రమేశ్‌ను పట్టుకున్నారు.
ఏసీబీకి చిక్కిన లింగంపేట ఎస్సై
కామారెడ్డి(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్సైగా సుధాకర్ పనిచేస్తున్నాడు. బుధవారం నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్‌లో ఓ వ్యాపారి నుంచి రూ.12,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా ఎస్సై సుధాకర్ సెలవులపై నిజామాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. గత రెండు నెలల క్రితం ఇదే స్టేషన్లో పనిచేసిన ఎస్సై అరుణ్‌కుమార్ ఓ కేసు విషయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే.