calender_icon.png 1 April, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలి

29-03-2025 06:12:59 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సిద్దిపేట సిపి అనురాధ అన్నారు. శనివారం దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, సీజ్ చేసిన వాహనాలు, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ లను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల రక్షణనే ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.

విలేజ్ పోలీస్ ఆఫీసర్ కేటాయించిన గ్రామాలను తరచుగా సందర్శిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని విజబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించి ఉదయం సాయంత్రం విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సమయం దొరికినప్పుడల్లా వాకింగ్, రన్నింగ్, యోగా చేయాలన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అవసరమైన ప్రదేశాలలో బ్లాక్ స్పాట్స్ వద్ద ఆర్ అండ్ బి అధికారుల సమన్వయంతో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఎసిపి పురుషోత్తం రెడ్డి, తొగుట సీఐ లతీఫ్, సిసిఆర్బి, ఎస్బి ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీధర్ గౌడ్, దౌల్తాబాద్, రాయపోల్ ఎస్సైలు శ్రీరామ్ ప్రేమ్ దీప్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు...