calender_icon.png 19 April, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవి ప్లాస్టిక్ బియ్యం కాదు..

16-04-2025 05:40:54 PM

పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్..

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): చౌక ధరల దుకాణాల్లో ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారన్న ప్రచారం అవాస్తవమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాధ్(District Civil Supplies Department Officer Srinath) తెలిపారు. అసత్య ప్రచారాలు చేస్తే  క్రిమినల్ కేసుల నమోదు చేస్తామని ఆయన తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో చౌక దుకాణాల ద్వారా ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురిచేసి, సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలాంటి ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని ఆయన సూచించారు. జిల్లాలో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిసాయని సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్లాస్టిక్ బియ్యం సరఫరా లేదని అవి పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ బియ్యమని, ప్రజలు ఆందోళన చెందోద్దని సూచించారు.