calender_icon.png 20 September, 2024 | 5:41 AM

లంచం తీసుకొంటూ పట్టుబడిన అధికారి

19-09-2024 01:28:41 AM

రూ.1.14లక్షలు తీసుకుంటూ దొరికిన ఉద్యాన అధికారి

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): రూ.1.14లక్షలు లంచం తీసుకు ంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యాన అ ధికారి సూర్యనారయణ ఏసీబీకి పట్టుబడ్డా డు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ ర మేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రైతులకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కింద పరికరాలు మంజూరు చేస్తుంది. రైతుకు డ్రిప్ ఇ రిగేషన్‌పై రాయితీరావాలంటే ఉద్యాన అధికారి సర్టీఫై చేయాల్సి ఉంటుంది. గతంలో మహబూబాబాద్ జిల్లా ఉద్యాన అధికారిగా సూర్యనారాయణ పనిచేశాడు. ఆ సమయంలో డ్రిప్ ఇరిగేషన్ కంపెనీ నుంచి రూ.80వేలు కమీషన్ డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈసర్టిఫికెట్ ఇవ్వాలంటే గతంలోని రూ.80వేలు, ప్రస్తుతం రూ.34వేలు కలిపి మొత్తం రూ.1.14 లక్షలు ఇస్తేనే సర్టిఫై చేస్తానని డిమాండ్ చేశాడు. దీంతో కంపెనీ ప్రతినిధులు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం భద్రాద్రి జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో రూ.1.14 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.