calender_icon.png 7 October, 2024 | 5:55 PM

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి

04-09-2024 02:32:51 AM

మహబూబ్‌నగర్/గద్వాల(వనపర్తి), సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ వాణిజ్య, పన్నుల శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాంకర్ జీఎస్టీ అనుమతి కోసం రవినాయక్ అనే వ్యాపారి వాణిజ్య, పన్నుల శాఖ కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే రూ.50వేలు ఇస్తే అనుమతి లభిస్తుందని డిప్యూటీ కమిషనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపాడు. రూ.10వేలు ఇస్తానని రవినాయక్ ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రూ.10వేలు తీసుకుంటుండగా వెంకటేశ్వర్‌రెడ్డిని పట్టుకున్నారు. అధికారి స్వస్థలమైన గద్వాల పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలోని ఇంట్లో నల్లగొండ ఏసీబీ ఎస్సైలు వెంకట్రావు, రామారావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.