calender_icon.png 11 January, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ 37 శాతం వృద్ధి

04-01-2025 12:00:00 AM

కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ రిపోర్ట్

న్యూఢిల్లీ, జనవరి 3: దేశంలో 2024లో ఆఫీస్ లీజింగ్ మార్కెట్ చురుగ్గా ఉన్నదని, 8 ప్రధాన నగరాల్లో వర్క్‌స్పేస్ స్థూల లీజిం గ్ 19 శాతం వృద్ధిచెంది 885.2 లక్షల చదరపు అడుగులకు చేరిందని రియల్టీ కన్స ల్టెంట్ కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. 2023లో 745.6 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ లీజింగ్ జరిగింది.

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) పెరగడంతో వర్క్‌స్పేస్‌కు డిమాండ్ వృద్ధిచెందిం దని, మొత్తం లీజింగ్‌లో జీసీసీల వాటా 30 శాతం ఉన్నదని కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్షుల్ జైన్ తెలిపారు. రియల్టీ కన్సల్టెంట్ రిపోర్ట్‌లో వివరాల ప్రకా రం 2024లో 8 ప్రధాన నగరాల్లోకెల్లా బెం గళూరులో ఆఫీస్ లీజింగ్ 64 శాతం వృద్ధిచెంది 158.3 లక్షల చదరపు అడుగుల నుంచి 259.3 చదరపు అడుగులకు చేరింది.

వృద్ధిలో తదుపరి స్థానం హైదరాబాద్ ఆక్రమించింది. ఈ నగరంలో వర్క్‌స్పేస్ డిమాం డ్ 37 శాతం వృద్ధితో 90.1 లక్షల చదరపు అడుగుల నుంచి 123.1 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. ముంబైలో 27 శాతం పెరి గి 140.8 చదరపు అడుగుల నుంచి 178.4 చదరపు అడుగులకు చేరింది. అహ్మదాబాద్‌లో 11 శాతం వృద్ధితో 16.3 లక్షల చదరపు అడుగుల నుంచి 18.1 లక్షల చదరపు అడుగులకు పెరిగింది.

ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, పూనె ల్లో మాత్రం ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గగా, కోల్‌కతాలో స్థిరంగా నిలిచింది. ఢిల్లీ ఎన్సీఆర్‌లో ఆఫీస్ లీజింగ్ 3 శాతం క్షీణించి 135.7 లక్షల చదరపు అడుగుల నుంచి 131.4 లక్షల చదరపు అడుగులకు తగ్గింది. పూనెలో ఇది 97.4 లక్షల చదరపు అడుగుల నుంచి 84.7 లక్షల చదరపు అడుగులకు క్షీణించింది.