calender_icon.png 8 January, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ జోరు

25-12-2024 12:33:44 AM

* 2024లో 56 శాతం భారీ వృద్ధి

* కొలియర్స్ ఇండియా రిపోర్ట్

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: దేశంలో ఎకానమిక్ యాక్టివిటీని సూచిస్తూ ఆఫీస్ లీజింగ్ రికార్డుస్థాయికి పెరిగినట్లు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో 2024 సంవత్సరంలో వర్క్‌స్పేస్ లీజింగ్ 14 శాతం వృద్ధిచెంది 66.4 మిలియన్ చదరపు అడుగులకు పెరిగిందని రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా  తెలిపింది. గత క్యాలండర్ సంవత్సరంలో స్థూల ఆఫీస్ లీజిం గ్ 58.2 మిలియన్ చదరపు అడుగులుగా నమోదయ్యింది.

కొలియర్స్ ఇండియా మంగళవారం ఆరు ప్రధాన ఆఫీస్ మార్కెట్ల డేటాను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం 2024లో బెంగళూరులో ఆఫీసు స్థలాల డిమాండ్  39 శాతం వృద్ధిచెంది 15.6 మిలియన్ చదరపు అడుగుల నుంచి 21.7 మిలి యన్ చదరపు అడుగులకు చేరింది. హైదరాబాద్‌లో భారీగా 56 శాతం వృద్ధిచెంది 8 మిలి యన్ చదరపు అడుగుల నుంచి 12.5 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.

ముంబై లో లీజింగ్ 43 శాతం వృద్ధిచెంది 7 మిలియన్ చదరపు అడుగుల నుంచి 10 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. పూణెలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 4 శాతం వృద్ధితో 5.5 మిలియన్ చదరపు అడుగుల నుంచి 5.7 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. అయితే చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో మాత్రం ఈ ఏడాది ఆఫీస్ స్థలాలకు డిమాండ్ తగ్గింది. చెన్నైలో 35 శాతం క్షీణించి 10.5 మిలియన్ చదరపు అడుగుల నుంచి 6.8 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. ఢిల్లీ ఎన్సీఆర్‌లో వర్క్ స్పేస్ లీజింగ్ 16 శాతం తగ్గి 11.6 మిలియన్ చదరపు అడుగుల నుంచి 9.7 మిలి యన్ చదరపు అడుగులకు చేరింది. 

టెక్నాలజీ కంపెనీల నుంచే ప్రధాన డిమాండ్

ఈ 2024 సంవత్సరంలో ఆఫీస్ లీజింగ్‌కు ప్రధానంగా టెక్నాలజీ కంపెనీల నుంచి అధిక డిమాండ్ వచ్చిందని, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు, ఫైనాన్షియల్ సర్వీసు సంస్థలు తదుపరి స్థానాన్ని ఆక్రమిస్తున్నట్లు కొలియర్స్ ఇండియా రిపోర్ట్‌లో వివరించింది. ఆఫీస్ స్పేస్‌కు వచ్చే 2025లో డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కొలియ ర్స్ ఆఫీస్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అర్పిత్ మల్హోత్రా తెలిపారు. వచ్చే కొద్ది ఏండ్లలో 60 మిలియన్ చదరపు అడుగులను మించిన వార్షిక లీజింగ్ పరిపాటిగా మారుతుందన్నారు.