calender_icon.png 19 April, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దమ్మ తల్లి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పణ

19-04-2025 12:23:03 AM

కామారెడ్డి, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ కళ్యాణోత్సవానికి శుక్రవారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ తనయుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలోని అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

పెద్దమ్మ-పెద్దిరాజుల కళ్యాణం లో పాల్గొని అమ్మవారికి అక్షింతలు వేసి ఆశీర్వాదాన్ని కోరుకున్నారు. ఆయనతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డిలను ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగరపు ఎల్లయ్య తోపాటు ప్రతినిధులు సన్మానించారు.

కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శిలు అబ్రబోయిన స్వామి, తాటిపల్లి శ్రీకాంత్, నల్లపు అంజలి శ్రీనివాస్, పల్లె రామస్వామి గౌడ్, కొండ శ్రీనివాస్, కాంగ్రెస్ దోమకొండ గ్రామ అధ్యక్షుడు సీతారాం మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పులబోయిన రమేష్, సంతోష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఈశ్వర్ గౌడ్, ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు పున్న లక్ష్మణ్, పురుషోత్తం, రాజేందర్ ,రాజు ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.