భీమదేవరపల్లి, జనవరి 12: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మహిమాన్వితమైన లక్ష దళాలను (లక్ష త్రిదళం ఆకులను) స్వామి వారికి అర్చకులు సమర్పించారు.
పంచామృత అభిషేకం నిర్వహించి, లక్ష బిల్వార్చనను ఆలయ చైర్మన్ కొమురవెళ్లి చంద్రశేఖర్‌గుప్తా, కే రాజయ్య, మొగిపాలెం రాంబాబు, వినయ్‌శర్మ, డైరెక్టర్ కొంగొండ సమ్మయ్య, ఈవో కిషన్‌రావు ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద ఐదు చోట్ల ఉచిత తాగునీటి కూలర్‌లను జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి ఏర్పాటు చేశారు.