calender_icon.png 18 April, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు బోనాల సమర్పణ

09-04-2025 08:18:02 PM

కొల్చారం (విజయక్రాంతి): 'అమ్మ మమ్మల్ని చల్లంగా చూడమ్మా' గ్రామ దేవతలకు బోనాలు సమర్పించిన ముదిరాజ్ సంఘ సభ్యులు. మండల పరిధిలోని వరిగుంతం గ్రామంలో పెద్దమ్మ తల్లి రెండవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నాడు నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ, దేవతలకు బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవార్లకు సమర్పించారు. ముదిరాజ్ సంఘ సభ్యులు ప్రతి ఇంటి నుండి బోనాలను అలంకరించి భాజా భజంత్రీలతో శివసత్తుల నృత్యాలతో పోతురాజుల గావు కేకలతో గ్రామ కూడళ్లలో ఊరేగింపు నిర్వహించి నల్ల పోచమ్మ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాల వరకు చేరుకొని అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు మహిళలు గ్రామస్తులు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.