calender_icon.png 6 October, 2024 | 1:32 AM

జువాడితోనే ధూప, దీప నైవేద్యం

05-10-2024 01:12:06 AM

  1. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 
  2. కోరుట్లలో రత్నాకర్‌రావు విగ్రహావిష్కరణ

జగిత్యాల, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఉమ్మడి ఏపీలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన దివంగత నేత జువాడి రత్నాకర్‌రావు కృషితోనే నేటికీ ప్రతి గుడిలో ధూప, దీప, నైవేద్యం కొనసాగుతుందని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వెటర్నరీ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన జువాడి రత్నాకర్‌రావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రత్నాకర్‌రావు రైతు నేతగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆయన చూపిన బాటలో ముందు కు వెళ్తున్నామని చెప్పారు.

ప్రత్యేక పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన తండ్రి శ్రీపాదరావు మరణానంత రం జువాడి రత్నాకర్‌రావు తనను ప్రోత్సహించి వైఎస్సార్ చెంతకు తీసుకెళ్లారని దుద్ది ళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది వారు చూపిన బాటలో నడుస్తున్నానని వెల్లడించారు. రత్నాకర్‌రావు ఎంతో మంది యువ నేతలు తీర్చిదిద్దారని చెప్పారు.

బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపారని గుర్తు చేశారు. జగిత్యాలలో జేఎన్టీయూకు ధీటుగా కోరుట్లలో పశువైద్య కళాశాల ఉండాలని పట్టుద లతో వెటర్నరీ, పాలిటెక్నిక్ కళాశాలను తీసుకొచ్చారన్నారు. ధర్మ పురి దేవస్థాన అభి  వృద్ధికి ఎంతగానో కృషి చేసిన గొప్ప మహనీయుడు రత్నాకర్‌రావు అన్నారు.

కార్య క్రమంలో ఎంపీలు కిరణ్, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, భానుప్రసాద్ రావు, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కు మార్, ఆది శ్రీనివాస్, సంజయ్‌కుమార్, గ డ్డం వినోద్‌కుమార్, జువాడి రత్నాకర్‌రావు తనయు లు, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువాడి నర్సింగరావు, జువాడి కృష్ణారావు, శేఖర్‌రావు, కోరుట్ల మున్సిపల్ చైర్‌ప ర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్స న్ అడువాల జ్యోతి, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్‌గౌడ్, మండలాధ్యక్షుడు కొంతం రాజాం, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు మచ్చ కవిత పాల్గొన్నారు.

మహాలక్ష్మి ఆలయంలో పూజలు

మంథని, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మంథనిలోని శ్రీమహాలక్ష్మి ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రి ని శేషవస్త్రాలతో ఘనంగా సన్మానించారు. మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపత బానయ్య తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.

మంథనిలో ఆకుల నాగరాజు మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని, మం థని మండలం వెంకటపూర్ మాజీ ఎంపీటీసీ కుడుదుల వెంకన్న తల్లి మృతి చెందగా వారి కుటుంబాన్ని, రామగిరి మండలం రామయ్యపల్లిలో మాజీ ఎంపీపీ ఆరేళ్లి దేవక్కకొమురయ్యగౌడ్ తండ్రి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను, లద్నాపూర్ గ్రా మంలో యువజ న కాంగ్రెస్ పార్టీ డివిజిన్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్ తండ్రి మృతి చెం దగా వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు.

ముత్తారం మండలంలో ని మచ్చుపేట గ్రామంలో ముదిరాజ్ కులస్థులు మంత్రి శ్రీధర్‌బాబును ఘనంగా సన్మానించారు. గ్రామంలో నిర్మిస్తున్న పెద్ద  మ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. సానుకులంగా స్పందించిన మంత్రి తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

మంత్రి వెంట మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రా మ, కాంగ్రెస్ విభాగ అధ్యక్షుడు తిరుపతియాదవ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు సురే ందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానం దం, మండలాధ్యక్షుడు దొడ్డ బాలజీ, వైస్ చైర్మన్ శ్రీపద బానయ్య, మోహన్‌శర్మ ఉన్నారు.