calender_icon.png 28 December, 2024 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరసింహుడికి అరకిలో బంగారం సమర్పణ

02-08-2024 02:04:37 AM

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 1 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు గురువారం అర కిలో బంగారాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన రాంరెడ్డి, అనురాధ దంపతులు స్వామివారి గర్భాలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయడానికి బంగారాన్ని సమ ర్పించారు. ప్రధానాలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ భాస్కర్‌రావుకు బంగా రాన్ని అందజేశారు.