* స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు లోకల్ జీటీఏ లేఖ
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఇచ్చిన ఓడీ (అదర్ డ్యూటీ) సౌకర్యాన్ని రద్దు చేయాలని లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం వీరాచారి, ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మీకాంతరెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డికి శుక్రవారం లేఖ రాశారు.
ఉపాధ్యాయ సంఘ నాయకులకు ఓడీ విద్యాహక్కు చట్టానికి విరుద్ధమన్నారు. టీచర్లు కేవలం బోధన మాత్రమే చేయాలని, బోధనేతర పనుల్లో ఉండకూడదని పేర్కొన్నారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులకు ఇచ్చే ఓడీ కారణంగా దాదాపు ప్రజాధనం వృథా అవుతుందని, వీరికిచ్చిన ఓడీ సౌకర్యాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు.