హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఒడిశా రాష్ట్రానికి చెందిన 2023 బ్యాచ్ ప్రొబెషనరీ ఐఏఎస్ అధికారుల బృందం.. జీహెచ్‌ఎంసీలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్‌పై అధ్యయనం నిమిత్తం సోమవారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు జీహెచ్‌ఎంసీ ట్యాక్స్, ఫైనాన్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి కీలక విభాగాల్లో జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న చర్యలను, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం, ప్రజలకు అందిస్తున్న ఆధునిక సేవలు, సాంకేతికత గురించి తెలుసుకున్నారు.
జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీస్, జాయింట్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, మహేశ్ కులకర్ణి, ఓఎస్‌డీ అనురాధ తదితరులు ఐఏఎస్‌ల బృందానికి ఆయా విభాగాల పనితీరును వివరించారు. ఒడిశా ప్రొబెషనరీ ఐఏఎస్‌లు ఆశ్ని ఏఎల్, కస్తూరి పాండ, తేజస్విని బేహెరా, దుద్దల్ అభిషేక్ దిలీప్, ప్రణీత దాష్, ప్రేక్ష అగర్వాల్, సరవనన్, ఎంసీహెచ్‌ఆర్‌డీ ఫ్యాకల్టీ శ్రీనివాసరావు, జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఎస్‌ఈ కోటేశ్వర రావు, చీఫ్ పీఆర్వో మహమ్మద్ ముర్తుజా అలీ, ఓఎస్‌డీలు ఏవీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.