06-02-2025 01:41:11 AM
* 7, 8, 9వ తేదీల్లోనిర్వహణ
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): స్వాభిమాన్ ఒడియా ఉమెన్స్ వరల్డ్ శిల్పారామం సంయుక్తంగా ఈ నెల 7, 8, 9వ తేదీల్లో శిల్పారామంలో ఒడియా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళాను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఒడియా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమంలో ఒడిశాలోని అత్యుత్తమ వంటకాలు, సంప్రదాయ చేతి పనులు, మంత్రముగ్ధులను చేసే సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించనున్నట్టు సంస్థ అధ్యక్షురాలు సస్మితా మిశ్ర తెలిపారు.
ఒడిశాలోని ప్రసిద్ధ సంబల్‌పురి, బొమ్‌కై, కోట్‌ప్యాడ్, అల్లికలతో పాటు క్లిష్టమైన పట్టాచిత్ర పెయింటింగ్‌లు, ధోక్రా మెటల్‌వర్క్, మాస్టర్ కళాకారులచే అప్లిక్ వర్క్‌లను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకలో భాగం కావాలని స్వాభిమాన్ ఒడియా ఉమెన్స్ వరల్డ్ ప్రతినిధులు కోరారు.