calender_icon.png 21 February, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఓదెల 2’ మహాకుంభమేళాలో టీజర్ లాంచ్..

19-02-2025 07:14:28 PM

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. ఇది 2021లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్‌పై డి మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ సాధు పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 22న కాశీ మహా కుంభమేళాలో లాంచ్ చేయనున్నారు. కాశీ మహా కుంభమేళాలో లాంచ్ కానున్న మొట్టమొదటి టీజర్ ‘ఓదెల 2’ కావడం విశేషం. 

ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో కుంభమేళా బ్యాక్ డ్రాప్‌లో నాగసాధుగా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో పవర్ ఫుల్ గా ఉంది.  చిత్రం కోసం ప్రేక్షకులను అలరించే బ్రెత్ టేకింగ్ స్టంట్స్‌ని పెర్ఫామ్ చేయడానికి తమన్నా భాటియా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ని ఇవ్వబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ఎంగేజింగ్ కథనాలతో థ్రిల్లింగ్ యాక్షన్‌ను బ్లెండ్ చేయడంలో పాపులరైన సంపత్ నంది ఈ చిత్రాన్ని సూపర్ విజన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.