calender_icon.png 1 April, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగసాధువు ద్వారా ఓదెల కష్టాన్ని తీర్చడమే కథ

23-03-2025 12:38:05 AM

తమన్నా భాటియా ప్రధాన పాత్ర లో నటిస్తున్న బహుభాషా చిత్రం ‘ఓదెల 2’. అశోక్‌తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ పతాకం పై డీ మధు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఈ సం దర్భంగా చిత్రబృందం శనివారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ తమ న్నా మాట్లాడుతూ.. “ఇది ఈజీ జోనర్ కాదు. ఒక పల్లెటూరి కథను డైరెక్టర్ ఇంత ఎక్సైటింగ్‌గా, థ్రిల్లింగ్‌గా చెప్పడం మామూ లు విషయం కాదు. నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులు ఓ కొత్త అనుభూతి పొందాలనుకుంటా. అలాంటి కొత్త కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది.

భైరవి క్యారెక్టర్ చేయడం నటిగా నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్‌లో హైయెస్ట్ ఐషాట్ క్లోజప్స్ ఉన్న సినిమా ఇదే” అన్నారు. మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. ‘ఓదెల సినిమా నాకు ఒక ఎమోషన్. నేను ఆ ఊర్లో పుట్టి పెరిగాను. చాలా గౌరవంగా ప్రేమతో ఈ సినిమాను రాసి తీశాం. ఊరిని కాపాడేది ఆ ఊర్లో ఉన్న ఇలవేల్పు గుడి. ఒక లైన్ లో చెప్పాలంటే.. 

ఒక కష్టం వస్తే.. ఆ ఊరిలో ఉన్న ఓదెల మల్లన్న.. నాగసాధు క్యారెక్టర్ ద్వారా ఎలా పరిష్కరించాడనేదే కథ’ అని చెప్పారు. ఓదెల లాంటి గొప్ప సినిమా అవకాశం తనకు రావడం గురించి డైరెక్టర్ అశోక్ తేజ చెప్తూ.. ‘ఆకలిగా ఉందని అన్నం కోసం సంపత్ నంది దగ్గరికి వెళ్లాను.. ఆయన నాకు బిర్యానీ తినిపించారు’ అన్నారు. ‘చాలా ఆర్గానిక్‌గా ఒక విలేజ్‌లో జరిగే స్టోరీ ఇది’ అని నిర్మాత డీ మధు తెలిపారు. ఇంకా నటి పూజ, నటులు వశిష్ట సింహ, నాగమహేశ్, గగన్ పాల్గొన్నారు.