21-04-2025 12:00:00 AM
తమన్నా భాటియా నాగసాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల-2’. సంపత్ నంది సూపర్ విజన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు అశోక్‌తేజ దర్శకత్వం వహించారు. డీ మధు నిర్మించారు. ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం హైదరా బాద్‌లో డివైన్ సక్సెస్ మీట్ పేరుతో ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సంపత్ నంది మాట్లాడు తూ.. “ఆ పరమ శివుడు లేకుండా ఈ సినిమా ఐడియా లేదు.
తమన్నా 20 ఏళ్ల కెరీర్ ఒకవైపు.. ఇందులో ఆమె క్యారెక్టర్ ఇంకోవైపు అంటున్నారు. ఆమె అంత అద్భుతంగా నటించడమే కారణం. ఇకపై తెలుగు సినిమా వశిష్టను నెత్తిన పెట్టుకోవడం ఖాయం. సమాధిశిక్ష, సైకిల్, తిరుపతి, క్ల్లుమాక్స్‌లో ఉన్న 20 నిమిషాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఈ సినిమా బడ్జెట్ మీరు అనుకున్న బడ్జెట్ కాదు. విడుదలకు ముందే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది.
మాకు ప్రేక్షకుల రూపంలో వచ్చే ప్రతి రూపాయీ ఆ పరమాత్ముడిచ్చే ప్రసాదంగా భావిస్తాం” అన్నారు. డైరెక్టర్ అశోక్ మాట్లాడుతూ.. “సినిమా బాగుంటేనే కలెక్షన్స్ పెరుగుతాయి. మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అది మా ‘ఓదెల-2’కు జరుగుతోంది” అని చెప్పారు. నిర్మాత మధు మాట్లాడుతూ.. “ సమీక్షకుల కంటే ప్రేక్షకుల అనుభూతి మాకు ముఖ్యం” అన్నారు. నటుడు వశిష్ట ఎన్ సింహ మాట్లాడుతూ.. “మనం ఇక్కడ ఎంత మాట్లాడినా..
మన సినిమా థియేటర్‌లో మాట్లాడుతోంది. క్ల్లుమాక్స్‌లో శివుడి దర్శనం కలిగేటప్పుడు ప్రేక్షకులు దండం పెడుతు న్నారు. వాళ్లకు సినిమా నచ్చకపోతే అలా చేయరు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులోనూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి” అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్, ఫైట్ మాస్టర్ వెంకట్, ఎడిటర్ అవినాష్, డిస్ట్రిబ్యూటర్లు శంకర్, సురేశ్, చిత్రబృందం పాల్గొన్నారు.