calender_icon.png 7 October, 2024 | 5:05 AM

అక్టోబర్ 7 భయాలు

07-10-2024 01:45:21 AM

ఇజ్రాయెల్‌లో హమాస్ దాడులకు నేటికి ఏడాది పూర్తి

టెల్‌అవీవ్ ఏం చేస్తుందని అంతటా ఉత్కంఠ

ఇరాన్ మిస్సైళ్ల దాడితో పరిస్థితి మరింత తీవ్రతరం

ఏదైనా జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులే!

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన కిరాతక దాడికి సోమవారంతో ఏడాది పూర్తయింది. ఆనాటి దాడి నుంచి పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు నేటికీ కొనసాగుతున్నాయి. ఆనా డు హమాస్‌పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్.. హమాస్, హెజ్బొల్లాకు చెందిన కీలక నేతలను హతమార్చింది.

లెబనాన్‌లో జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా, అనంతరం అతని వారసుడిగా పేర్కొంటున్న హషీమ్ సఫీద్దీన్‌ను సైతం చంపేసింది. హమాస్ చీఫ్ ఆచూకీ కూడా కొన్ని రోజుల నుంచి గల్లంతయింది. హమా స్, హెజ్బొల్లా, హౌతీ సహా అనేక శత్రువులతో ఇజ్రాయెల్ భీకరంగా పోరాడుతోంది.  

7న జరగనుంది?

ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన మిస్సైల్ దాడులు కూడా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత తీవ్రంచేశాయి. ఇరాన్‌పై తీవ్రమైన ప్రతిదాడి ఖాయమని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇందుకు అమెరికా మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్‌పైనా హమాస్, హెజ్బొల్లా అదేతరహా దాడులు చేసేందుకూ ప్రణాళికలు చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. అందుకే మధ్యప్రాచ్యంలో సోమవా రం ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా ఆందోళనలు మొదలయ్యాయి.  

ఇరాన్‌పై దాడి చేస్తుందా?

గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో 1,195 మంది మరణించగా.. 251 మంది పౌరులను హమాస్ బందీలుగా తీసుకెళ్లింది. అప్పటినుంచి గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. అనంతరం లెబనాన్‌లోని హెజ్బొల్లా దాడులు ప్రారంభించ గా.. హమాస్‌తో పాటు ఆ సంస్థపైనా ఇజ్రాయెల్ భీకర దాడులను ప్రారంభించింది.

వారం వ్యవధిలోనే సంస్థ చీఫ్‌తో పాటు ఏడుగురు కీలక నేతలను తుదముట్టించింది. కానీ, అక్టోబర్ 1న ఇరాన్ మిస్సైల్ దాడులకు ఇజ్రాయెల్ ఇంతవరకూ స్పందించలే దు. అక్టోబర్ 7కు గుర్తింపుగా టెహరాన్‌పై దాడులు చేసే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం దాడులకు ముందు నెతన్యాహు ప్రకటనలోనూ ఇరాన్‌కు నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పిస్తామని ఖమేనీని ఉద్దేశించి చెప్పారు. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

ప్రపంచ ఆర్థికవ్యవస్థలో చమురు, సము ద్ర వాణిజ్యంలో పశ్చిమాసియా మూలకేం ద్రంగా వ్యవహరిస్తోంది. ప్రపంచంలో అధిక శాతం వాణిజ్యం ఈ దేశాల గుండానే జరుగుతోంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడే అవకాశము ంది.

ఆయిల్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం వంటి రంగాలను దెబ్బతీయడంతో పాటు రవాణా ఖర్చు భారీ గా పెరుగుతుందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే దేశాలకు చేసే ఎగుమతులపైనా బీమా భారం కూడా పెరుగుతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్‌తో భారత వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రపం చ వాణిజ్యం, ఆర్థికవ్యవస్థపై వివిధ రూపాల్లో గణనీయ ప్రభావం పడుతుంది. 

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా!

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతాయి. ప్రస్తుతానికి మధ్యప్రాచ్యంలోని సౌదీఅరేబియా, ఖతా ర్, జోర్డాన్, యూఏఈ సహా ఈజిప్టు తటస్థంగా వ్యవహరిస్తున్నాయి. అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రరాజ్యాలు ఆడే ఆటలో వీరి మధ్య పోరు ఎటువైపు పోతుందో చెప్పలేం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా పశ్చిమదేశాలపై ఇదే తర హా ఆరోపణలు చేశారు.

ఇక్కడ ఉద్రిక్తతలు తీవ్రమైతే మూడో ప్రపంచయుద్ధా నికీ దారి తీసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి అక్టో బర్ 7న ఇజ్రాయెల్ ఏం చేస్తుందనే ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. పౌరుల భద్రత, జాతీయవాదానికి ప్రాధాన్యమిచ్చే ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనం ఉండవని చెబుతున్నారు. 

పశ్చిమాసియాలో ముఖ్య ఘటనలు

* 2023 అక్టోబర్ 7: ఇజ్రాయెల్ సరిహద్దుల్లో హమాస్ దాడి. రాకెట్లతో విరుచుకుపడిన ఉగ్రసంస్థ. 1200 మంది మృతి. 250 మంది కిడ్నాప్. గాజాపై ఇజ్రాయెల్ దాడులు. 

* 2023 అక్టోబర్ 27: గాజాలో ఇజ్రాయెల్ భూతల దాడులు 

* 2023 నవంబర్ 24: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ. 80 మంది బందీలను విడుదల చేసిన హమాస్. 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల. 

* 2024 ఏప్రిల్ 13: డ్రోన్లు, మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు

* 2024 జూలై 30: హెజ్బొల్లా కీలక నేత ఫవాద్ షుక్ హత్య. ఆ తర్వాతి రోజే హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హతం. 

* 2024 సెప్టెంబర్ 17: లెబనాన్‌లో హెజ్బొల్లా లక్ష్యంగా పేజర్ల పేలుడు. తర్వాతి రోజు వాకీటాకీల పేలుడు. ఈ ఘటనల్లో 37 మంది మృతిచెందగా, 3 వేల మందికి గాయాలయ్యాయి.  

* 2024 సెప్టెంబర్ 27: లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. హెజ్బొల్లా కమాండర్ నస్రల్లా హత్య. అంతకుముందు వారం రోజులుగా చేసిన దాడుల్లో ఏడుగురు కీలక కమాండర్లు హతం. 

* 2024 అక్టోబర్ 1: నస్రల్లా, హనియే హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర క్షిపణి దాడులు. అదే రోజు లెబనాన్‌లో భూతల దాడులు ప్రారంభం.