calender_icon.png 15 November, 2024 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాల చెరువు కు ఓసీపీ మట్టితో పొంచివున్న ముప్పు

14-11-2024 01:08:08 PM

వర్షానికి మట్టితో నిండుకుంటున్న చేరువు రైతులకు తీవ్ర నష్టం

పట్టించుకొని సింగరేణి అధికారులు

చేరువు పరిశీలనలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మస్కులు సురేందర్ రెడ్డి 

మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని కన్నాల చెరువుకు ఓసీపీ మట్టితో పెద్ద ప్రమాదమే ముప్పు పొంచి ఉందని, ఇటీవల కురిసిన వర్షానికి మట్టి కొట్టుకు వచ్చి చెరువు నిండుకుంటున్నదని, దీంతో చేరువు కింద ఆయకట్టు రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని,  సింగరేణి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని చేరువు ను పరిశీలించిన కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మస్కులు సురేందర్ రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి తోకల మల్లేష్, సింగిల్ విండో డైరెక్టర్ ఉడుత పర్వతాలు యాదవ్ లతో కలిసి కన్నాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర్ల దేవాలయం సమీపంలోనే ఉన్న చెరువును పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ చెరువు దేవాలయం పక్కనే ఉండడంతో గ్రామంలోని ప్రజలకు  రైతులకు ఎంతో ఉపయోగపడేదని, ఈ చెరువు కింది రైతులు రెండు పంటలు పంటలు పండించేవారని,  సింగరేణి ఓసీపీ మట్టి చెరువు సమీపంలోకి వచ్చి వర్షానికి మట్టి కొట్టుకొని చెరువులో కలుస్తుందని, దీంతో నీళ్లు చేరువులో నిలువలేక ఎండిపోతుందని, రైతులకు పంటలు పండడం లేదని, గ్రామంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దేవాలయానికి కూడా ప్రమాదం పొంచి ఉందని వారు తెలిపారు. ఇప్పటికైనా సింగరేణి సంస్థ అధికారులు స్పందించి వెంటనే గ్రామానికి ఎంతో పెద్దదిక్కులా ఉన్న ఈ చెరువు ను రక్షించాలని మరమ్మత్తులు ఏర్పాటు చేసి, మట్టిని చెరువులోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని కోరారు. లేకుంటే రైతులతో కలిసి సింగరేణి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వారి వెంట రైతులు పాపిరెడ్డి తదితరులు ఉన్నారు.