08-02-2025 12:27:18 AM
* కబ్జా భూముల్లో వెలుస్తున్న వెంచర్లు
* చెరువులను చెర పడుతున్న కబ్జాకోరులు
నిజామాబాద్ ఫిబ్రవరి 7(విజయ క్రాంతి): సాగునీటి వనరుల అభివృద్ధికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపడుతు వేలకోట్ల రూపాయలు సాగునీటి నిలువకు పంటలకు నీరు అందించేందుకు అనేక వయ ప్రయాసలు ఓర్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి.
కానీ ప్రయోజనం లేకుండా పోతుంది. నిజామాబాద్ జిల్లాలోని చెరువుల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఇరిగేషన్ రెవెన్యూ శాఖలు వాటి పరిరక్షణకై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టకపోవడమే ఎందుకు కారణం. శిఖం భూములు కబ్జాకు గురవుతున్న అధి కారులు పట్టించు కో కుండ కబ్జా చేస్తున్న వారికి సహకరించడం వల్ల జిల్లా మండల కేంద్రాల్లో ఉన్న చెరువులు కాలువలు వాగులు, కనుమరు గైపోతున్నాయి.
జిల్లాలో 1,225 వరకు చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు వాగుల ద్వారా సుమారు రెండు లక్షల 25 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఈ చెరువు లపై ఆధారపడి ఉంది. నిజామాబాద్ శివారు డిచ్ పల్లి మండలం లోని ఘన్‌పూర్‌లో 102 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి చెరువులో దాదాపు 15 ఎకరాలకు పైగా భూమి కబ్జాకు గురైంది.
ఈ పరిధిలోనే గల 44 వ జాతీయ రహదారి పక్కనే గల ఏదుల చెరువు 39 ఎకరాలు ఉండగా ఇందులో దాదాపు 40 శాతానికి పైగా కబ్జాకు గురైంది. గత ప్రభుత్వం లో ఉన్న అధికార పార్టీ లీడర్లే సంబంధిత అధికారులతో చేతులు కలిపి చెరువులను కబ్జా చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా మధ్యలో నుండీ కొనసాగుతున్న నేషనల్ హైవే 44 పరిధిలో ఉన్న జక్రాన్ పల్లి ఆర్మూర్ బాల్కొండ డిష్పల్లి ఇందల్వాయి మండల కేంద్రాలు అభివృద్ధి లో దూసుకుపోతున్నాయి.
స్థానికంగా ఉన్న భూముల పట్టాదారులు ఉండడంతో అత్యధిక ధరలు పలికే మండల కేంద్రాలలోని స్థలాలపై అధి కారుల కన్ను పడింది అక్కడ ఎకరాకు కోట్లపైనే రేటు పలుకుతోంది. ఇక్కడే రియా క్టర్లకు అద్భుతమైన ఆలోచన తట్టింది అదే చెరువులను కబ్జా చేయడం బరంతీతో నింపడం నాలా కన్వర్షన్ చేయడం మున్సిపల్ పరిధిలో అయితే ముంతకల్ చేయడం వెనువెంటనే ప్లాట్లు చేసి అమ్మడం సొమ్ము చేసుకోవడం ఇక్కడి రాజకీయ నాయకులకు ఇది వెన్నతో పెట్టిన విద్య.
చిన్న చితక ద్విచక్ర వాహనా లపై తిరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అనుబంధం ఉన్న రాజకీయ నాయకులు నేడు ఖరీదైన కార్లలో విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. తిలాపాపం తలా పిడికెడు అన్న చందనంగా తమకు సహకరించిన వారికి సహకరించినంత స్థాయిలో వాటాలు వేసుకొని స్వపక్షం విప క్షం అని తేడా లేకుండా కలిసి పంచుకుం టున్నారు.
ప్రజా ప్రతినిధుల అండదండ లతో కబ్జాలకు పాల్పడిన భూములు నాలా కన్వర్షన్ అయి మున్సిపాలిటీలో సైతం ముంతకిలై ఇంటి నెంబర్లు కేటాయించ బడ్డాయి. ఇలాంటి సంఘటనలు జిల్లా నలు మూలల నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీని అధికార ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ తాతంగం అంతా కొన సాగుతుండడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.
మరికొందరు అవినీతి అధికారులు తమ స్వామి భక్తిని చాటుకొని ఇచ్చింది పుచ్చు కొని దొంగ చాటుగా వారికి సహకరిస్తూ సూచనలు ఇస్తూ పక్కాగా పని చేసి పెడుతు న్నారు. జిల్లాలో ఉన్న మొత్తం చెరువులు ప్రస్తుతం మిగిలి ఉన్న చెరువులు1,225 ఉన్నాయి ఈ చెరువులలో దాదాపు ఒక 175 కు పైగా చెరువులు కబ్జాకు గురయ్యాయి ఇటీవల జరిపిన సర్వేలో ఇంచుమించుగా ఈ సంఖ్య స్పష్టమైంది జిల్లాలో చెరువుల కబ్జా పెరిగి నీటి సామర్థ్యం తగ్గితే ఈ ప్రభావం పంట సాగుపై కూడా పడుతుంది పంట సాగు తగ్గే అవకాశం ఉంది 1975 నుండి రికార్డుల తిరిగి సర్వే చేసి చెరువులను కాపాడాల్సిన అవసరం ఉంది.