calender_icon.png 3 October, 2024 | 5:57 AM

కబ్జాదారుల్లో సర్వే గుబులు!

03-10-2024 02:01:18 AM

ఉలిక్కిపడుతున్న దేవునిమాన్యం ఆక్రమణదారులు

సమస్య పక్కదారి పట్టేలా తప్పుడు ప్రచారాలు

మోక్ష వెంకటేశ్వరుడి భూములకు విముక్తి కల్పించాలని గ్రామస్థుల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ ౨ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కాకతీయులనాటి దేవాల యమై న మోక్ష వెంకటేశ్వరస్వామి ఆల య మాన్యం భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయించాలనే డిమాండ్‌తో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది. 

ఈ నేపథ్యం లో కొందరు సంబంధం లేని వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తూ సమస్యను పక్కదారి పట్టించే పనిచేపడ్డారు. లోతుగా విచారిస్తే ఆ సక్తిగల అంశా లు వెలుగులోకి వస్తాయని గ్రామస్థులు చెప్తున్నారు. గ్రామస్థులు, దేవాదాయశాఖ అధికారులు దేవునిమాన్యం భూములు సర్వే చే యాలని కోరుతున్నా.. రెవెన్యూ అధికారులకు కబ్జాదారులు అడ్డుతగులుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

1958 నుంచి రెవెన్యూ రికార్డు ల్లో ఉన్న భూముల వివరాలను సర్వే చేయకపోవడంపై అనుమానాలకు తావిస్తున్నది. కబ్జాదారుల్లో కొందరికి ఈ  భూములపై రెవెన్యూ అధికారులు తప్పుడు సర్వే నంబర్‌తో పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేయడం, వారు దేవునిమాన్యం భూముల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

సంఘాలను, లేని పదవులను అడ్డుపెట్టుకొని దర్జాగా దండుకొంటున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరో వైపు ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. 

అధికారుల తీరుపై అనుమానాలు.. 

కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాదారుల చేతిలో చిక్కుకున్నా ఎండోమెంట్ అధికా రులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారుల పై నిందలు వేస్తూ కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నా యి. ఈ అంశాన్ని తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎందుకు పరిష్కరించట్లేదని నిలదీస్తున్నా రు. అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని కబ్జాదారులు దర్జాగా భూములు ఆక్రమించి అనుభవిస్తున్నారు. 

2019లో ఎండోమెంట్ అధికారుల ఏర్పాటు చేసిన  బోర్డు ప్రకారం సర్వే నంబర్ 119 లో 3.28 ఎకరాలు, సర్వే 120లో 9.31 ఎకరాలు, 121లో 15.35 ఎకరాలు మొత్తం 29.04 ఎకరాలుగా ఉన్నట్టు అప్పటి ఈవో రత్నప్రభ, అధికారులు ఇక్కడ బోర్డు ఏర్పాటుచేశారు. ప్రస్తుత ఈవో రమాదేవి తెలిపిన వివరాల  ప్రకారం..

సర్వే నంబ ర్ 119/అ లో 3.28 ఎకరాలు, 120/అ లో 9.31 ఎకరాలు, సర్వే నంబర్ 121/అ లో 8.25 ఎకరా లు మొత్తం 21.30 ఎకరాలుగా చెప్తున్నారు. సర్వే నంబర్‌లో, విస్తీర్ణంలో వ్యత్యాసాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా దేవాదా య శాఖ అధికారులు సర్వే నిర్వహించి, దేవుడి భూములను కబ్జాదారుల కబంద హస్తాల్లోంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.